Share News

తెరపైకి కొత్త మండలాలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 01:26 AM

జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. గత ప్రభుత్వం కొత్త జిల్లాలో ఏర్పాటు సమయంలో రెవెన్యూ డివిజన్లతో పాటు కొన్ని మండలాలను ఏర్పాటు చేసింది. మెట్‌పల్లి, కోరుట్ల రెవెన్యూ డివిజన్లను అప్పటి ప్ర భుత్వం ఏర్పాటు చేసింది. దీనికి తోడు బీమారం, ఎండపల్లి మండలా లను సైతం కొత్తగా ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముం దు ప్రభుత్వం జిల్లాలోని బండలింగాపూర్‌ను సైతం మండలంగా ఏర్పా టు చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

తెరపైకి కొత్త మండలాలు

జగిత్యాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. గత ప్రభుత్వం కొత్త జిల్లాలో ఏర్పాటు సమయంలో రెవెన్యూ డివిజన్లతో పాటు కొన్ని మండలాలను ఏర్పాటు చేసింది. మెట్‌పల్లి, కోరుట్ల రెవెన్యూ డివిజన్లను అప్పటి ప్ర భుత్వం ఏర్పాటు చేసింది. దీనికి తోడు బీమారం, ఎండపల్లి మండలా లను సైతం కొత్తగా ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముం దు ప్రభుత్వం జిల్లాలోని బండలింగాపూర్‌ను సైతం మండలంగా ఏర్పా టు చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సంబంధిత గెజిట్‌ విడుదల చేసి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. కొం త వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఎన్నికల సమయంలో డి మాండ్‌ పెరిగి పలు ప్రాంతాలను మండలాలుగా చేయాలని డిమాం డ్‌ ముందుకు వచ్చింది. దీంతో బండలింగాపూర్‌ ప్రాంత వాసులు తమకు కొత్త మండలం ఏర్పాటు అవుతుందని సంతోషంలో ముని గా రు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం..కొత్త మండలాల ప్ర స్తావన మళ్లీ తెరపైకి రావడం..రాష్ట్రంలో కొన్ని మండలాలను ప్రకటిం చడం. మరికొన్నింటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో, ఒక వైపు చర్చతో పా టు మరోవైపు డిమాండ్‌లు పెరగడం, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థా యి ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతోం ది. ఇదే సమయంలో కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు డిమాండ్‌ సైతం ముందుకు వస్తోంది. ధర్మపురి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు అంశాన్ని ఏకంగా ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రస్తా వించడం చర్చలకు దారి తీస్తోంది.

మొదలైన డిమాండ్లు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పాత కరీంనగర్‌ కాకుండా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే అ ప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం జిల్లాలో పలు కొత్త మండలాలను కూడా ఏ ర్పాటు చేసింది. బుగ్గారం, బీర్‌పూర్‌ మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. అనంతరం స్థానిక ప్రజల డిమాండ్‌ మేరకు జిల్లాలో ఎండప ల్లి, బీమారం మండలాలను ఏర్పరిచారు. 2023 జూన్‌లో అప్పటి సీఎం కేసీఆర్‌ హామీ మేరకు జిల్లాలోని బండలింగాపూర్‌ గ్రామాన్ని మరో మండలంగా ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే బండలింగాపూర్‌ మండలంపై స్పష్టత రాకముం దే ఎన్నికలు జరగడం, ప్రభుత్వ మార్పుతో ఈ అంశం తెరమరుగైంది.

అల్లీపూర్‌ మండలం కోసం కదులుతున్న ఫైళ్లు..

జిల్లాలోని రాయికల్‌ మండలంలో మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉ న్న అల్లీపూర్‌ను కొత్త మండలంగా ఏర్పాటు చేయడానికి ఫైళ్లు వేగం గా కదులుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు సీఎం రేవంత్‌ రె డ్డిని కలిసి అల్లీపూర్‌ మండలం అంశం ఆయన దృష్టికి తీసుకవచ్చా రు. దీనికి తోడు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సైతం అల్లీపూర్‌ను మండలం గా ఏర్పాటు చేయాలని సీఎంకు పంపిన లేఖ ద్వారా కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. సానుకూలంగా స్పందించిన సీఎం ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఫైళ్లు వేగంగా కదు లుతున్నాయి. రాయికల్‌ మండలంలో గల 32 గ్రామాల నుంచి 11 గ్రా మాలను కలుపుకొని అల్లీపూర్‌ మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

బతికెపల్లి వాసుల డిమాండ్‌...

పెగడపల్లి మండలంలో గల బతికెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది. మేజర్‌ పంచాయతీ గ్రామ మైన బతికెపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు ఇటీవల కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందించారు. 1983లో టీడీపీ హయాంలో బతికెపల్లిని మండలంగా ఏర్పాటు చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్‌, ప్రైమరీ గెజిట్‌ జారీ చేసి అర్ధాంతరంగా ఆపివేసిందంటూ ప్రస్తుతం సంబందిత అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవల ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

నోటిఫికేషన్‌కు పరిమితం..

మెట్‌పల్లి మండలంలో ప్రస్తుతం గల 10 గ్రామాలను కలుపుతూ నూతనంగా బండలింగాపూర్‌ మండలాన్ని ఏర్పాటు చేయడానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023 జూన్‌లో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చే సింది. బండలింగాపూర్‌, రాజేశ్వర్‌రావుపేట, మేడిపల్లి (పడమర), రా మచంద్రంపేట, విట్టంపేట, మెట్లచిట్టాపూర్‌, జగ్గసాగర్‌, రామలచ్చక్క పేట, రంగారావుపేట, ఆత్మకూర్‌ రెవెన్యూ గ్రామాలతో బండలింగా పూర్‌ మండలాన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిశీలించిన అనం తరం ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆపివేశారు.

జగిత్యాల కార్పొరేషన్‌గా డిమాండ్‌...

జిలా కేంద్రమైన జగిత్యాల పట్టణాన్ని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చే యాలన్న డిమాండ్‌ సైతం తెరపైకి వచ్చింది. ఇటీవల భారత్‌ సురక్ష సమతి నాయకులు కలెక్టర్‌ సత్య ప్రసాద్‌కు ఈ మేరకు వినతిపత్రం అందించారు. పట్టణ శివారలోని పలు గ్రామాలను విలీనం చేస్తూ కా ర్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

అసెంబ్లీలో ధర్మపురి రెవెన్యూ డివిజన్‌ ప్రస్తావన...

ధర్మపురిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రతినిత్యం భారీ ఎత్తున నలుమూలల నుంచి వే లాది మంది భక్తులు వస్తుంటారని, అధికంగా రైతులున్న ప్రాంతమైన ధర్మపురిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రస్తావించారు. గ తంలో సైతం ధర్మపురి ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రభుత్వంలో ఉ న్న పెద్దల దృష్టికి తీసుకవెళ్లామని వివరించారు. ధర్మపురి రెవెన్యూ డి విజన్‌ డిమాండ్‌ చేస్తూ గతంలో ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ విప్‌ అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఈఅంశం మరోమారు తెరపైకి వచ్చింది.

Updated Date - Jan 01 , 2025 | 01:26 AM