Share News

అర్బన్‌పార్కుతో ప్రజలకు ఆహ్లాదం

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:07 AM

అర్బన్‌ అటవీ పార్కు ఏర్పాటుతో పట్టణ, పరిసరప్రాంత ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల మండలం అంబారిపేట గ్రామంలోని ఫారెస్ట్‌లో రెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న పార్కు పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు.

అర్బన్‌పార్కుతో ప్రజలకు ఆహ్లాదం
అర్బన్‌పార్కును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తదితరులు

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అర్బన్‌ అటవీ పార్కు ఏర్పాటుతో పట్టణ, పరిసరప్రాంత ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల మండలం అంబారిపేట గ్రామంలోని ఫారెస్ట్‌లో రెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న పార్కు పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల ప్రజలకు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసమే అర్బన్‌పార్కు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అర్బన్‌పార్కులో వాచ్‌టవర్‌, సోలార్‌ బోర్‌పంపులు, వివిధ జంతువుల చిత్రాలు తదితర వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జగిత్యాల పట్టణ ప్రజలకు కాంక్రీట్‌ జంగిల్‌ నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కృషి చేస్తున్నామ న్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో రవిప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్లు ఆడువాల జ్యోతి, మోర హన్మాండ్లు, వైస్‌చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, ఎఫ్‌ఆర్‌వో పద్మారావు, డీఆర్‌వో శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ తోట మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

- పెర్కపల్లిని గ్రామపంచాయతీ చేయాలి..

జగిత్యాల మండలం తిప్పన్నపేట పరిధిలోని పెరుకపల్లి గ్రామా న్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ పెర్కపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పొందడంలో జాప్యం జరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

- ఎమ్మెల్యేను కలిసిన బాలసదన్‌ బాలికలు..

నూతన సంవత్సరాన్ని పురష్కరించుకొని జగిత్యాల బాల సదన్‌ అనాథ బాలికలు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కలిసి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు భోనగిరి నరేష్‌, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:07 AM