రామగిరిఖిల్లా పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:22 AM
అంతర్జాతీయ స్థాయిలో రామగిరిఖిల్లాను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
రామగిరి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయిలో రామగిరిఖిల్లాను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివా రం మండలంలోని బేగంపేట్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాముడు నడిచి న నేలగా పేరుగాంచిన రామగిరిఖిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ఖిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రూ.5కోట్లను మంజూరుచేసినట్లు తెలిపారు. రామగిరి ఖిల్లాపై ఎన్నో వనమూలికలు ఉన్నాయని తెలిపారు. అన్ని హంగులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
సింగరేణి ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని సెంటినరీకాలనీలో ఆదివారం ఐఎన్ టీయూసీ నూతన క్యాలెండర్‌ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి, నాయకులు రామారావు, సత్రం సమ్మయ్య, నరేడ్ల శ్రీనివాస్‌రావు, మనోహర్, పీవీ గౌడ్, సర్వన్, కొమురయ్య, సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు.