ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే కుటుంబాలకు భరోసా..
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:21 AM
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం రామగుం డం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు.
కోల్‌సిటీ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం రామగుం డం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయం వద్ద పోలీస్ కమిషనర్, ఐజీ శ్రీనివాస్ 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి మున్సిపల్ జంక్షన్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే వారి కుటుంబాలకు భరోసా ఉంటుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహ నాలు నడుపాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో తమ విలువైన ప్రాణాలు పోగొట్టు కుంటున్నారన్నారు. కార్లు నడిపే వారు విధిగీ సీటు బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించి పత్రాలు అందబాటులో ఉంచాలన్నారు. యువత తాత్కాలిక ఆనందం కోసం ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నా రని, తల్లిదండ్రులకు మనో వేదన మిగుల్చుతున్నార న్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కూడా తగ్గడం లేదన్నారు. గత ఏడాది కాలంలో కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు రూ.13కోట్ల జరిమానా విధించినట్టు సీపీ తెలిపారు. 5కే రన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సీపీ అభినం దించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంక టేశ్వర్లు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్‌రావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనీల్‌కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.