దోషులకు శిక్ష పడడంలో బాధ్యతగా వ్యవహరించాలి
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:57 AM
నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యా యం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ అన్నారు.
కోల్‌సిటీ, జనవరి 4(ఆంధ్రజ్యోతి): నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యా యం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం సీపీ ఎం శ్రీనివాస్ అన్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జైల్లో శిక్ష అనుభ విస్తున్న ఖైదీలను పోలీసులు ఎస్కార్ట్ ద్వారా జాగ్రత్తలు పాటిస్తూ తీసుకురావాలని, నేరస్థులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని సీపీ సూచించారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా దోషులకు శిక్ష పడడంతో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత చాలా కీలకమైదని, నేరస్థులకు వారెంట్స్, సమన్లు సత్వరమే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు పాటించాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు సీసీటీఎన్‌ఎస్‌లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే బాధితులపై మనపై నమ్మకం పెరుగుతుం దన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీలు సుందర్‌రావు, ప్రసాద్, లీగల్ సెల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, సీసీఆర్‌బీసీ ఇన్‌స్పెక్టర్ సతీష్‌తో పాటు పెద్దపల్లి, మంచిర్యాలజోన్‌ల కోర్టు డ్యూటీఆఫీసర్లు పాల్గొన్నారు.
మావోయిస్టు కదలికలపై అప్రమత్తం..
మావోయిస్టు కదలికలపై అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ పార్టీ పోలీసులకు రామగుండం సీపీ శ్రీని వాస్ సూచించారు. శనివారం కమిషనరేట్‌లో స్పెషల్ పార్టీ సిబ్బందికి గ్రేహౌండ్స్ తరహా శిక్షణ కార్యక్రమా న్ని నిర్వహించారు. కమిషనర్ ఆర్‌ఎస్‌ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రే హౌండ్స్ వాపమక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, మా వోయిస్టుల ఏరివేతకు, వారికి ఇచ్చే శిక్షణను స్పెషల్ పార్టీ పోలీసులకు ఇస్తున్నట్టు చెప్పారు. సిబ్బంది ఫిజిక ల్ ఫిట్‌నెస్, స్కౌడ్ డ్రిల్, ఆయుధ వినియోగం, కోల్‌నా, జోల్‌నా, ఆర్మ్‌డ్ డ్రిల్, ఫాట్స్ నేమ్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్ రావు, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, సంపత్, మల్లేషం, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.