Share News

అన్ని వర్గాల ప్రజలను కలిపేవి క్రీడా మైదానాలే

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:19 AM

కుల, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కలిపేది క్రీడా మైదానాలేనని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

అన్ని వర్గాల ప్రజలను కలిపేవి క్రీడా మైదానాలే

ధర్మారం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కుల, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కలిపేది క్రీడా మైదానాలేనని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని కమ్మరిఖాన్‌పేటలో నిర్వహించిన ప్రీమియం లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టోర్నీలో విజయం సాధించిన అన్నారం జట్టుకు ప్రథమ బహుమతిగా 30 వేల రూపాయల నగదు సొంతంగా అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన కమ్మరిఖాన్‌పేట జట్టుకు 15 వేల నగదుతో పాటు ఇరు జట్లకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ ఆటలో గెలుపు, ఓటములు సహజమన్నారు. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా తిరిగి ప్రయత్నిస్తే ఒకరోజు గెలుపు వరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 01:19 AM