కార్పొరేషన్‌లో పారిశుధ్యంపై పటిష్టమైన చర్యలు
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:54 AM
రామగుండం కార్పొరేష న్‌లో పారిశుధ్యంపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు అద నపు కలెక్టర్, కార్పొరేషన్ కమి షనర్ అరుణశ్రీ చెప్పారు.
కోల్‌సిటీ, జనవరి 4 (ఆంధ్ర జ్యోతి): రామగుండం కార్పొరేష న్‌లో పారిశుధ్యంపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు అద నపు కలెక్టర్, కార్పొరేషన్ కమి షనర్ అరుణశ్రీ చెప్పారు. శని వారం రామగుండం నగరపాల క సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాలను సందర్శించి పారి శుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను పరిశీలిం చారు. సూపర్‌వైజర్లు పారిశుధ్యంపై క్షేత్రస్థాయి లో అందుబాటులో ఉంటూ పారిశుధ్యాన్ని రోజూ పరిశీలించాలని, రామగుండాన్ని చెత్త ర హిత నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్‌లలో జరుగుతున్న అభి వృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా నాణ్యతతో పనులను వేగ వంతం చేయాలని సూచించారు. అనంతరం మల్కాపూర్‌లోని ఎనిమల్ బర్త్ కంట్రోల్ భవ నాన్ని సందర్శించారు. 2వ డివిజన్‌లోని ఇందిర మ్మ కాలనీని సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను తనిఖీచేశారు. రెండు రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. వెంట నగరపాల క సంస్థ ఎస్‌ఈ శివానంద్, అసిస్టెంట్ కమిషన ర్ రాయలింగు, ఈఈ రామన్ ఉన్నారు.