రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:14 AM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు.
పెద్దపల్లిటౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, డీసీపీ ఎం.చేతనతో కలిసి రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల వినియోగం నియం త్రణపై నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలోని రహదారి మిడిల్ వద్ద పిచ్చిమొక్కల తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. లారీలు, ట్రాక్టర్, భారీ వాహనాలు, కార్లకు ముందు వెనుక తప్పనిసరిగా 10 రోజులలో రేడియం స్టిక్కర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూ చించారు. రాజీవ్ రహదారిపై అవ సరమైన చోట పోలీస్, ఆర్‌టీవో అధి కారుల సమక్షంలో రంబల్ స్ట్రీప్స్ ఏ ర్పాటుచేయాలన్నారు. అవసరమైన చోట హైమాస్ట్ లైటింగ్ కోసం ప్రతిపాదనలు అందించా లని, టర్నింగ్ దగ్గర వెంటనే రేడియం స్టిక్కర్లతో బోర్డు ఏర్పాటుచేయాలని, మీడియన్ వద్ద ఎత్తుగా పెరిగిన మొక్కలు తోలగించాలన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం కల్పించాలని, పౌర సరఫరాల శాఖతో చర్చించి జిల్లాలో ఒక వారం పెట్రోల్ బంక్‌లలో హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయ కుండా వ్యూహాత్మకంగా అమలుచేయాలని వివరించారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడ్ లిమిట్ బోర్డులను, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా స్టిక్కర్లు ఏర్పాటు చేయాల ని సూచించారు. ప్రతి పాఠశాల వద్ద స్కూల్ జోన్ బో ర్డులు ఉండాలన్నారు. రోడ్డుపై ట్రాక్టర్లు కేజ్ వీల్ విని యోగిస్తే వాహనం సీజ్ చేయాలని దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరిగితే దగ్గరలోని ఏ ఆసుపత్రికి తరలించాలో మ్యాపిం గ్ చేయాలని తెలిపారు. జిల్లాలోని డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉ న్నత పాఠశాలల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించా లన్నారు. డ్రగ్స్‌కు బానిసలైన యువకులు, పిల్లలపై కేసు లు నమోదుకాకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా అవ సరమైన కౌన్సిలింగ్ చేసి డీఅడిక్షన్ సెంటర్ ద్వారా డ్రగ్స్ వాడకం బానిసత్వం పోయేలా చర్యలు తీసుకోవాల న్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ బావ్ సింగ్, మంథని ఆర్డీవో సురేష్, డీఈవో మాధవి, డీడబ్ల్యూ.ఓ., వేణుగోపాలరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జిల్లా అటవీ అధికారి శివయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ అన్న ప్రసన్నకుమారి, రవాణా శాఖ అధికారులున్నారు.