పాడి కౌశిక్‌రెడ్డిపై కేసులు బేషరతుగా ఎత్తివేయాలి
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:18 AM
హుజూరాబాద్ శాసన సభ్యుడు కౌశిక్‌రెడ్డిపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన సంఘటనపై రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశం పూర్తిగా మంత్రుల ఆజమాయిషిలో జరగాల్సిన సమావేశంలో పోలీసులు ఒక ఎమ్మెల్యేను లాక్కెళుతుంటే ఆపాల్సిన మంత్రులు ఏం మాట్లాడకుండా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేపై జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
భగత్‌నగర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ శాసన సభ్యుడు కౌశిక్‌రెడ్డిపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన సంఘటనపై రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశం పూర్తిగా మంత్రుల ఆజమాయిషిలో జరగాల్సిన సమావేశంలో పోలీసులు ఒక ఎమ్మెల్యేను లాక్కెళుతుంటే ఆపాల్సిన మంత్రులు ఏం మాట్లాడకుండా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేపై జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పరసర్పర ఆరోపణలు చేసుకున్నా ఏక పక్షంగా పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిని లాక్కెళ్లారని విమర్శించారు. చట్ట సభల ప్రతినిధులపై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశానికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్లామన్నారు. రేషన్ కార్డులు అందించి ఇందిరమ్మ ఇళ్లను అందివ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే పేదలపై పర్మిషన్ల భారం పడకుండా చూడాలన్నారు. ఉపాధి కూలీలు 20 రోజులు పనిచేస్తే 12 వేలు ఇస్తామన్నారని, గ్రామాల్లో ఉపాధి హామి కూలీకి వెళ్లకుండా చాలా మంది ఉంటారన్నారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో అర్హులైన కూలీలందరికి 12 వేలు అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటన్నింటిపై వివరణ ఇవ్వాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.