కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు..
ABN , Publish Date - Jan 13 , 2025 | 01:30 AM
గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరబట్టి సింగరేణి కార్మికుల సంక్షేమ, సామాజిక విధ్వంసానికి పాల్పడుతున్నదని హింద్ మజ్దూర్ సభ(హెచ్‌ఎంఎస్) జిల్లా అధ్యక్షుడు తోటవేణు ఆరోపించారు.
గోదావరిఖని, జనవరి 12(ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెరబట్టి సింగరేణి కార్మికుల సంక్షేమ, సామాజిక విధ్వంసానికి పాల్పడుతున్నదని హింద్ మజ్దూర్ సభ(హెచ్‌ఎంఎస్) జిల్లా అధ్యక్షుడు తోటవేణు ఆరోపించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో క్వార్టర్ నిర్వాసిత కార్మికులతో కలిసి ఆయన మాట్లా డారు. రామగుండం ఎమ్మెల్యే గోదావరిఖని అభివృద్ధి పేరిట, ఎలాంటి హేతు బద్ధత, ప్రణాళికా లేకుండా నిరంకుశంగా, ఏకపక్షంగా వవహరిస్తూ సామాజిక విధ్వంసానికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం సింగ రేణి రిజియన్ అధికారులను తన చెప్పు చేతల్లో పెట్టుకుని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్నారు. సింగరేణి అధికారులు కూడా ఇక్కడి ఎమ్మెల్యేకు వంత పాడుతూ, తానా అంటే తందానా అంటూ ఇల్లీగల్‌గా వ్యవహరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రామగుండం ఎమ్మెల్యే మతి లేకుండా చేపడతున్న పనులకు సింగరేణి వత్తాసు పలుకుతూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటని ఆరోపించారు. పోయిన సంవత్సరం రూపొందించిన శిలాఫలకాన్ని, అందులో పేర్కొన్న 20మంది ప్రముఖులు లేకున్నా, నిస్సిగ్గుగా ఆవిష్కరించి, బడ్జెట్ అనుమతులు లేకుండానే షాపింగ్ కాంప్లెక్స్‌కు సింగరేణి రూ.20కోట్లు ఇచ్చిందని ప్రచారం చేయడం సహించరానిదన్నారు. ఇకనైనా సింగ రేణి ఆర్‌జీ-1 అధికారులు కార్మిక పక్షపాతిగా వ్యవహరించి వారి న్యాయమైన కోరికలను తీర్చి పరిష్కారాలను కనుక్కోవాలన్నారు. లేకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండి, సమస్య, పోరాటాలు మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో క్వార్టర్ నిర్వాసితులు గంపల సమ య్య, పోతరాజు భాస్కర్, పీ శ్రీనివాస్, బత్తుల రాంబాబు, కాంపెల్లి రామస్వామి, బండారి శివ పాల్గొన్నారు.