Share News

లయన్స్‌ క్లబ్‌ సేవలు ప్రశంసనీయం..

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:33 AM

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలను గుర్తించి వారికి సేవలు అందించడంలో లయన్స్‌ క్లబ్‌ ఉత్తమ ప్రశంసలు అందుకుంటోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

లయన్స్‌ క్లబ్‌ సేవలు ప్రశంసనీయం..

పెద్దపల్లి రూరల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలను గుర్తించి వారికి సేవలు అందించడంలో లయన్స్‌ క్లబ్‌ ఉత్తమ ప్రశంసలు అందుకుంటోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం మండలంలోని రంగాపూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో లయన్స్‌ క్లబ్‌ ఇంట ర్నేషనల్‌ రీజియన్‌ మీట్‌ కార్యాక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ల ద్వారా గ్రామాల్లో ఉచిత డయాబెటిస్‌ క్యాంపులు, పేదవారికి ఆర్థిక సాయం, నిరుపేదలకు ముడిసరుకులు, ఉచిత వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్‌లు వంటివి చేయడం ద్వారా చాలామందికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, వివధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 01:33 AM