Share News

నేడు మకర సంక్రాంతి

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:17 AM

మకర సంక్రాంతి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతిగా పాటిస్తారు. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరగడమే దీని ప్రత్యేకత. భోగి భోగభాగ్యాలకు, సంక్రాంతి సంపదకు, కనుమ కలిమికి చిహ్నంగా చెప్పే సంక్రాంతి మూడు రోజుల పండుగలో భాగంగా మంగళవారం సంబరాల సంక్రాంతికి, బుధవారం కనుమ పండుగకు జనం స్వాగతం పలుకనున్నారు.

నేడు మకర సంక్రాంతి

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మకర సంక్రాంతి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మకర సంక్రాంతిగా పాటిస్తారు. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరగడమే దీని ప్రత్యేకత. భోగి భోగభాగ్యాలకు, సంక్రాంతి సంపదకు, కనుమ కలిమికి చిహ్నంగా చెప్పే సంక్రాంతి మూడు రోజుల పండుగలో భాగంగా మంగళవారం సంబరాల సంక్రాంతికి, బుధవారం కనుమ పండుగకు జనం స్వాగతం పలుకనున్నారు.

ఫ మకర సంక్రమణం.. మంగళప్రదం...

మకర సంక్రమణం లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా చెబుతారు. శ్రీమన్నారాయణుడితో కలిసి లక్ష్మీదేవి రంగుల ముగ్గుల రథాన్ని ఎక్కి వస్తుందంటారు. అందుకే ముగ్గులకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. దాన్యరూపంలో ఉన్న లక్ష్మీదేవితో పాటు సంక్రాంతి పురుషుడు, బలి చక్రవర్తి ఇళ్లకు వచ్చి శుభాలనిస్తారనే భావనతో ప్రతి ఇంటిని మహిళలు ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి పసుపుకుంకుమలతో గడపను అలంకరిస్తారు.

ఫ ఘనంగా భోగి వేడుకలు

జిల్లా కేంద్రంలో భోగి పర్వదినాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే లేచి భోగి మంటలు వేసుకొని మంగళ స్నానాలాచరించి దైవ దర్శనం చేశారు. కొందరు సాయంత్రం భోగి మంటలు కాల్చారు. జిల్లా కేంద్రంలోని వారంతా పల్లెలకు తరలి పోగా వీధులన్ని బోసి పోయి కన్పించాయి. చిన్నారులు, యువత గాలిపటాలను ఎగరేస్తూ సందడిగా గడిపారు. జ్యోతినగర్‌ 59 డివిజన్‌లో కార్పోరేటర్‌ గందె మాధవి-మహేశ్‌ దంపతుల ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. పలు డివిజన్లలో, కూడళ్లలో భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు.

Updated Date - Jan 14 , 2025 | 01:17 AM