Share News

దివ్యాంగుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:10 AM

దివ్యాంగుల అభ్యున్నతికి సం పూర్ణ సహకారం అందజేస్తామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

దివ్యాంగుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం

పెద్దపల్లిటౌన్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగుల అభ్యున్నతికి సం పూర్ణ సహకారం అందజేస్తామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవా రం కలెక్టరేట్‌ ప్రాంగణంలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావుతో కలిసి కలెక్టర్‌ అలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో దివ్యాంగులకు 27 లక్షల రూపాయల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత నవంబర్‌లో అలింకో సంస్థ ద్వారా క్యాంప్‌ నిర్వహించి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులైన దివ్యాంగులను ఎంపిక చేశామన్నారు. రాబోయే 2 నెలల వ్యవధిలో మరొక సారి క్యాంపు నిర్వహించి ఇంకా ఎవరైనా ఉంటే వారికి పరికరాల పంపిణీకి చర్యలు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడు తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటు లో ఉంటున్నాయని, దీనికి కృషి చేసిన కలెక్టర్‌కు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో జిల్లా ఆసుపత్రిని వం ద పడకలకు విస్తరిస్తున్నామని, నెలాఖరు నాటికి టెండర్‌ పూర్తిచేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరా వు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 01:10 AM