Share News

వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శం

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:28 AM

స్వామి వివేకానందుడి ఆశయానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితం యువ తకు ఆదర్శమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శం

సుల్తానాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానందుడి ఆశయానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితం యువ తకు ఆదర్శమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానా బాద్‌ పట్టణంలోని వివేకానందుని విగ్రహం వద్ద జయంతి కార్యక్ర మం నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వివేకానందుడి బోధనలు నేటి యువతరానికి ఎంతో ఆవసర మన్నారు. యువత వల్లనే దేశం శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాజుల లక్ష్మీ రాజమల్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌ పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

పెద్దపల్లి కల్చరల్‌ (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌ కార్యాలయంలో యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేష్‌ వివే కానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఈనెల 7న జరిగిన రాష్ట్రస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ హైదరా బాద్‌లో పాల్గొన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పార్టిసి పేషన్‌ సర్టిఫికెట్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యా యులు సురేందర్‌, రమేష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగాం అఽధికారి శంకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 01:28 AM