పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:13 AM
పంచాయతీ కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో ఆదివారం నిర్వహించారు.
భగత్‌నగర్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ కార్మికుల వేతనాలు మూడు నెలలుగా ఇవ్వలేదన్నారు. వేతనాలు ఇవ్వక పోవడంతో సంక్రాంతి పండుగకి కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎండిగ రవీందర్‌రావు, కాశిపాక శంకర్, వడ్లూరి లక్ష్మీనారాయణ, ఎలకపల్లి సారయ్య, బోయిని స్వరూప, మహంకాలి కొమురయ్య, సమ్మయ్య, రవి, కొత్తూరు మల్లయ్య, మల్లేశం, శ్రీకాంత్ పాల్గొన్నారు.