కాకతీయ కాలువకు నీటి విడుదల
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:41 AM
కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటిని విడుదల చేశారు. ముందుగా జలాశయంలో పూలు చల్లి అనంతరం మీటనొక్కి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల కొనసా గించాలని అధికారులను ఆదేశించారు.
తిమ్మాపూర్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటిని విడుదల చేశారు. ముందుగా జలాశయంలో పూలు చల్లి అనంతరం మీటనొక్కి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల కొనసా గించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఎస్‌ఈ పెద్ది రమేష్ మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్‌కు ఆరు తడులు ఆన్ ఆఫ్ పద్ధతి ద్వారా స్టేజి 1కు 8 రోజులు, స్టేజీ 2కు 7రోజులు మొత్తంగా 90 రోజులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 6లక్షల 97 వేలా 708 ఎకరాలకు మార్చి 31,2025 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ నాగభూషన్ రావు, డీఈ శ్రీనివాస్, ఏఈఈలు వంశీధర్, గీతిక, సంజన, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.