Share News

పరిహారం ఇచ్చేదెప్పుడు?

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:43 AM

కొత్తపల్లి-మనోహరబాద్‌ రైల్వే లైన్‌ నిర్వాసితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తపల్లి-మనోహరబాద్‌ రైల్వే లైనును గంగాధర మండలం కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి, కాసారం, ఉప్పరమల్యాల గ్రామాల మీదుగా నిర్మించడానికి 18 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పరిహారం ఇచ్చేదెప్పుడు?
రైల్వే లైనులో కోల్పోతున ్న గృహాలు

గంగాధర, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి-మనోహరబాద్‌ రైల్వే లైన్‌ నిర్వాసితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తపల్లి-మనోహరబాద్‌ రైల్వే లైనును గంగాధర మండలం కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి, కాసారం, ఉప్పరమల్యాల గ్రామాల మీదుగా నిర్మించడానికి 18 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2020 ఫిబ్రవరిలో బహిరంగ ప్రకటనను విడుదల చేసి రైల్వే లైనులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, బావులు, చెట్లు, పైపులైను, ఇళ్ల వివరాలను ప్రకటించారు. పలుమార్లు అధికారులు రెవెన్యూ గ్రామాల్లో ముంపు గ్రామ సభలు నిర్వహించి, సర్వేలు నిర్వహించారు. 2024 సెప్టెంబరులో భూసేకరణ కోసం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అనంతరం పలుమార్లు కరీంనగర్‌ ఆర్డీవో, భూసేకరణ అధికారులు, రైల్వే అధికారులు గ్రామ సభలు నిర్వహించి ముంపు వివరాలను వెల్లడించి అభ్యంతరాలు కోరారు. తర్వాత ఎటువంటి కదలికా లేదు.

ఫ ఎటూ తేల్చని అధికారులు

పరిహారం అందుతుందని కొండంత ఆశతో ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులు అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. మరి కొందరు వ్యవసాయ భూములు కొనుక్కున్నారు. ఇటు భూములు తీసుకోక, పరిహారం అందించకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అవసరానికి భూములు అమ్ముకుందామన్నా ఎవరూ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన్త ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఇదే రైల్వే లైనులో భూమలు కోల్పోతున్న కొండన్నపల్లి, బోయినపల్లి మండల రైతుల భూములకు గతంలోనే పరిహారం అందించారు.

ఫ ఇల్లు, భూమి పోతున్నాయి..

- పాసం రవీందర్‌, రైతు, రంగరావుపల్లి

అప్పులు చేసి కట్టుకున్న ఇల్లుతోపాటు ఐదు గుంటల భూమి రైల్వే లైను కింద పోతుంది. ప్రతి సంవత్సరం అధికారులు వస్తూ గ్రామ సభలు నిర్వహించి సర్వేలు చేసి పరిహారం అందిస్తామని చెప్పి పోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు.

ఫ అవార్డు ఎక్వరీ అయినా డబ్బులు రాలేదు

సందవేని మల్లేశం, రైతు,, రంగరావుపల్లి

గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి అవార్డు ఎక్వరీ చేసి డబ్బులు ఇస్తామని అధికారులు 2020లో సంతకాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి అభ్యంతరాలకు దరఖాస్తులు తీసుకున్నారు. 24 గుంటల వ్యవసాయ భూమి రైల్వే లైను కింద పోతుంది. ఎన్నిసార్లు అడిగినా పరిహారం ఇవ్వడం లేదు. ఎకరానికి ఎంత ఇస్తామన్నది చెప్పడంలేదు

Updated Date - Jan 01 , 2025 | 12:43 AM