Leopard.. ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ABN , Publish Date - Feb 07 , 2025 | 08:53 AM
తెలంగాణలో చిరుత పులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచారం, కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఖమ్మం జిల్లా: పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి సంచారం (Leopard Sighting), కలకలం (Kalakalam) రేపుతోంది. చిరుత పాద ముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు (Forest Officials) అప్రమత్తమయ్యారు. పులి గుండాల ప్రాజెక్టు సమీపంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు మైక్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులి గుండాల సమీపంలో వ్యవసాయ పనుల కోసం వేళ్ళే వారు గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్ళాలని సూచించారు. రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు హెచ్చరిక చేశారు. చిరుతపులి కలిపిస్తే సమాచారం అందించాలని, వన్యప్రాణులకు హాని కలిగించవద్దని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
కాగా నాలుగు రోజుల క్రితం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, తిర్యాణి మండలం, చింతపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత సంచారాన్ని స్థానిక గ్రామస్తులు గుర్తించారు. పొలం పనులు ముగించుకుని అటవీ ప్రాంతంలో వెళ్లిన సమయంలో చెట్టు కొమ్మపై చిరుతపులి ఉండటాన్ని గమనించి ఫోన్లో వీడియో తీశారు. తర్వాత అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామస్తులు ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. చిరుతపులి జాడ కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ
విలువల గురించి జగన్ మాట్లాడటం...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News