Share News

రూ.120 కోట్లతో పట్టణ అభివృద్ధి

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:14 PM

పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసేందుకు సంవత్సర కాలంలోనే రూ.120 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

 రూ.120 కోట్లతో పట్టణ అభివృద్ధి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసేందుకు సంవత్సర కాలంలోనే రూ.120 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం 45వ వార్డు పరిధిలో రూ89.42 లక్షలు, 22వ వార్డు భగీరథ కాలనీలో రూ.1.40 కోట్లు, 10వ వార్డు మారుతీనగర్‌లో హైమాట్ట్‌ లైట్లతో పాటు రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌళిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తాగునీరు, డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, కౌన్సిలర్లు రాజు, రాణి, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఎంఈ బస్వరాజ్‌, డీఈ నర్సింహ్మ, ఏఈ వైష్ణవి పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:14 PM