రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:27 PM
రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమా ర్క అన్నారు.
వనపర్తి అర్బన్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమా ర్క అన్నారు. గురువారం రేవ ల్లి మండల పరిధిలోని తలు పునూరు లో రూ.2.06 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, గో పాల్‌పేట మండల పరిధిలోని ఏదుట్లలో రూ.1.96 కోట్ల వ్య యంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ వి ద్యుత్ ఉప కేంద్రాలను ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మె ల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వనపర్తి పట్టణం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట వనపర్తి మండలా నికి చెందిన కాశీంనగర్, నాగవరం, మెట్టుపల్లి, చిమనగుంటపల్లి , పెద్దమందడి మండలానికి సంబంధించిన పామిరెడ్డిపల్లి, గోపాల్‌పేట మం డలం తాడిపర్తి శ్రీరంగాపురం మండలాలకు సంబంధించిన 7 విద్యుత్ ఉప కేంద్రాల నిర్మా ణానికి రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లితో కలిసి శంకుస్థాపన చేశారు. అదే వి ధంగా ట్రాన్స్‌ఫార్మర్స్ కోసం దరఖాస్తు చే సుకున్న 50 మంది రైతులకు 50 విద్యుత్ ట్రా న్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు శం కుస్థాపన చేశారు.