సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 36 ఎకరాల గుర్తింపు
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:21 PM
నారాయణపేట జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గాను ఇప్పటివరకు 36 ఎకరాలు గుర్తించామని కలెక్టర్ సిక్తాప ట్నాయక్ తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన వీసీలో కలెక్టర్ సిక్తాపట్నాయక్
నారాయణపేట టౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గాను ఇప్పటివరకు 36 ఎకరాలు గుర్తించామని కలెక్టర్ సిక్తాప ట్నాయక్ తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై కలెక్టరేట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లా డారు. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏ ర్పాటుకు నిర్ధేశించిన గడువులోపు 150 ఎకరాలు గుర్తించి పూర్తిస్థాయి నివేదికలు సమర్పిస్తా మని ఆమె పేర్కొన్నారు. ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీవో రాంచందర్, డీఆర్‌డీవో మొగు లప్ప తదితరులున్నారు.
గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి..
ప్రభుత్వ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం దర ఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవే శాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఫిబ్రవరి ఒకటిలోపు ఆన్ లైన్‌లో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.