ఆందోళన.. హడావిడి
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:50 PM
నారాయణపేట జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఐదేళ్ల పాలక వర్గాల పదవీకాలం ముగిసేందుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో పాలకవర్గ సభ్యుల్లో ఆందోళనతో పాటు హడావుడి మొద లైంది. తమ వార్డుల్లో పెండింగ్ పనులను పూర్తి చేసుకు నేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. కొందరు కౌన్సిలర్లు వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 వరకు పాలకవర్గం గడువు ముగియనున్నది.
- పేట మునిసిపాలిటీలో తొమ్మిది నెలలుగా రూ.9,29,250 గౌరవభృతి పెండింగ్
- ఈ నెల 27 వరకు పాలకవర్గం గడువు
- పేట పాలకవర్గం సభ్యులకు గత మే నెల నుంచి చెల్లింపులు లేవు.. 8 నిధుల కొరతతో జాప్యం
నారాయణపేట, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఐదేళ్ల పాలక వర్గాల పదవీకాలం ముగిసేందుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో పాలకవర్గ సభ్యుల్లో ఆందోళనతో పాటు హడావుడి మొద లైంది. తమ వార్డుల్లో పెండింగ్ పనులను పూర్తి చేసుకు నేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. కొందరు కౌన్సిలర్లు వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 వరకు పాలకవర్గం గడువు ముగియనున్నది. జిల్లా వ్యాప్తంగా నారాయణపే ట, మక్తల్, కోస్గి మూడు మునిసిపాలిటీలు ఉన్నా యి. జిల్లాలోని నారాయ ణపేట మునిసిపాలిటీలో 24 వార్డులు, మక్తల్‌లో 16, కోస్గిలో 16 వార్డులు ఉన్నాయి. పాలకవర్గం గడువు కేవలం 19 రోజు లు మాత్రమే ఉంది. చివ రి సమయంలో నిధులు విడుదల అవుతాయన్న ఆ శతో ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటుండటంతో ముని సిపల్ కౌన్సిలర్లలో హడాహుడి నెలకొంది.
మునిసిపల్ పాలక వర్గం గౌరవ భృతి ఇలా..
మునిసిపాలిటీలో కొలువుదీరిన పాలకవర్గ సభ్యులకు ప్రభు త్వం అందిస్తున్న గౌరవ భృతి విషయానికి వస్తే నవం బరు 18, 2021న మునిసిపల్ పాలకవర్గం గౌరవ భృతిని ప్రభుత్వం పెంచింది. గ్రేడ్-2 ము నిసిపాలిటీల్లో నెలకు చైర్‌పర్సన్‌ల కు రూ. 12,000 నుంచి 15,600కు పెంచింది. వైస్ చైర్మన్‌లకు రూ.5,000 నుంచి రూ.6,500 పెం చింది. కౌన్సిలర్లకు రూ. 2500 నుంచి రూ.3250కి పెంచింది. మునిసిపల్ జనరల్ ఫండ్ నిధుల నుంచి పాలక వర్గ సభ్యులకు గౌరవ భృతిని బ్యాంకు ఖాతాలో అధికారులు జమ చేసేలా చ ర్యలు తీసుకుంటున్నారు.
తొమ్మిది నెలల గౌరవ భృతి అందాలి..
నారాయణపేట మునిసిపల్ పాలకవర్గానికి మే నెల నుంచి జనవరి వరకు తొమ్మిది నెలల గౌర వ భృతి అందాల్సి ఉంది. పేట మునిసిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాలక వర్గానికి నెల కు లక్షా మూడువేల రెండువందల యాభై రూపాయల ప్రకారం తొమ్మిది నెలలకు సంబంధించి రూ.9, 29,250 గౌరవ భృ తిని చెల్లించాల్సి ఉం ది. నిధుల కొరతతో గౌరవ భృతి చెల్లింపు లో జాప్యం జరగడంతో పలువురు సభ్యులు ఆందోళన చెందు తున్నారు.
త్వరలో చెల్లిస్తాం
నిధుల కొరతతో మునిసిపల్ పాలక వర్గం గౌరవ భృతి సభ్యుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరిగింది. త్వరలో గౌరవ భృతి చెల్లించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- సునీత, మునిసిపల్ కమిషనర్, నారాయణపేట