Share News

ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:32 PM

ఆశాలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, ఆశా యూనియన్‌ జిల్లా అధ్యక్షు రాలు బాలమణిలు డిమాండ్‌ చేశారు.

ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి
నారాయణపేట ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మార్కెట్‌ చైర్మన్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆశాలు

- ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కార్యకర్తల ధర్నా

నారాయణపేట/మక్తల్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆశాలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, ఆశా యూనియన్‌ జిల్లా అధ్యక్షు రాలు బాలమణిలు డిమాండ్‌ చేశారు. శుక్రవా రం జిల్లాలోని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నివాసం ముందు ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. అంతకు ముందు అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి పురవీధుల గుండా సీవీఆర్‌ భవ న్‌కు చేరుకున్నారు. ధర్నానుద్ధేశించి బాల్‌రామ్‌, బాలమణిలు మాట్లాడుతూ ఆశాలకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. 21న జిల్లా కలెక్ట రేట్ల ముందు ధర్నా చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతినిధిగా మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో గో పాల్‌, అంజిలయ్య గౌడ్‌, జోషి, అనురాధ, ఉమాదేవి, రాధిక, భా గ్యమ్మ, రేణుక, జ్యోతి, మౌనిక, శశికళ, అను రాధ, నాగమణి, రాధి క తదితరులున్నారు.

అదేవిధంగా, మ క్తల్‌ పట్టణంలోని ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరి ఇంటి ముందు సీఐటీ యూ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా గౌరవ అధ్య క్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. నాయకులు గోవిందరాజు, ఆంజనేయులు, రమేష్‌, ఆశ వర్క ర్లు యశోద, ఇందిరా, అమీనాబేగం, శివమ్మ, బా లమణి, పద్మ, అంజమ్మ, శాంతమ్మ, అనురాధ, సుజాత, లక్ష్మీ, వెంకటమ్మ, పార్వతమ్మ ఉన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 11:32 PM