ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:47 PM
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని గద్వాల డీఎస్పీ వై.మొగలయ్య సూచించారు.
గద్వాల డీఎస్పీ మొగలయ్య
వడ్డేపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని గద్వాల డీఎస్పీ వై.మొగలయ్య సూచించారు. శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయ న సందర్శించారు. స్టేషన్‌కు వచ్చిన బాధితుల తో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు. అనం తరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. వాట్సప్‌ల ద్వారా వచ్చే లింక్‌లను ఓపన్ చేయరాదని, లాటరీ తగిలిం దని, బహుమతి వచ్చిందని అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహిం చాలని చెప్పారు. పట్టణంలోని వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద, మెయిన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలని అన్నారు. అర్ధరాత్రి ఇంటి తలుపులు ఎవరైనా తడితే మొదట కిటికీలో నుంచి చూసి, వచ్చిన వ్యక్తులను గుర్తించాలని, అప్పుడే తలుపులు తెరవడం మంచిదని అన్నా రు. సమావేశంలో సీఐ టాటాబాబు, ఎస్‌ఐ సంతోష్ ఉన్నారు.