శ్రమదానంతో పూడికతీత
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:51 PM
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల సమీపంలోని కోమటికుంట నుంచి పెద్దకర్నంకుంట వరకు ఉన్న కేఎల్‌ఐ కాల్వలో పూడిక తీసేందుకు రైతులు శనివారం శ్రమదానం చేశారు.
- కేఎల్‌ఐ కాల్వలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు
- స్వచ్ఛందంగా తొలగిస్తున్న అన్నదాతలు
- ముందుకు సాగని నీరు
- పట్టించుకోని అధికారులు
లింగాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల సమీపంలోని కోమటికుంట నుంచి పెద్దకర్నంకుంట వరకు ఉన్న కేఎల్‌ఐ కాల్వలో పూడిక తీసేందుకు రైతులు శనివారం శ్రమదానం చేశారు. ఈ కాల్వలో దాదాపుగా ఐదు కిలోమీటర్ల మేరకు జమ్ము, ముళ్ల పొద లు, పిచ్చి మొక్కలు, రాళ్లు పేరుకపోయా యి. దీంతో సాగునీరు ముందుకు సాగక పోవడంతో ఆయకట్టుకు నీరందక రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. క్యాంపు రాయవరం, ధారారం, రాయవరం గ్రామా ల రైతులు పూడికతీత గురించి సంబంధి త అధికారులకు విన్నవించినా స్పందించ కపోవడంతో రైతులే స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి శనివారం కాల్వలో పేరుకపో యిన పూడిక, పిచ్చిమొక్కలు, జనుము తొలగిం చేందుకు పూనుకున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్‌శాఖ ఏఈ పరమేష్ ను వివరణ కోరగా కాల్వల నిర్వాహణను కాంట్రాక్టరు చూసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్ కొంత మేర పనులు చేశారు. ఈ కాల్వను కూడా శుభ్రం చేయాలని చెప్పాము, త్వరలోనే పూర్తిస్థాయిలో పను లు చేయిస్తామని తెలిపారు.