సిమెంట్ ట్యాంకరును ఢీకొట్టిన కారు ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:50 PM
రోడ్డు ప్ర మాదంలో ఇద్దరు యువ కులు దుర్మరణం చెందా రు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని జూపల్లి స మీపంలో జడ్చర్ల-కోదాడ జాతీయ రాహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకొంది.
చారకొండ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్ర మాదంలో ఇద్దరు యువ కులు దుర్మరణం చెందా రు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని జూపల్లి స మీపంలో జడ్చర్ల-కోదాడ జాతీయ రాహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. ఎస్‌ఐ శంషోద్దిన్ వివరాల ప్రకారం.. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన శాంపూరి గణేష్ (30), కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన కేతమల్ల రామకోటి (36)లు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్వోలుగా పనిచేస్తున్నారు. గణేష్ కల్వకుర్తి ప ట్టణంలో, రామకోటి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకోటి తన పెళ్లి చూపుల కోసం స్నేహితుడు గణేష్‌ను తీసుకొని కారులో వె ళ్లి తిరిగి వస్తుండగా ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ (లారీ)ని వెనకనుంచి కారు వేగంగా ఢీకొట్టింది. లారీ కింది భాగంలోకి కారు వెళ్లింది. అది గమనించని లారీ డ్రైవర్ సుమారు కిలో మీటర్ మేర ముందుకు దూసుకెళ్లడంతో పెద్ద శ బ్దం వచ్చింది. దీంతో లారీని నిలిపి చూడగా అప్పటికే కారు నుజ్జు నుజ్జు అయి నట్లు గుర్తించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చారకొండ, వంగూరు ఎస్‌ఐలు శంషోద్దీన్, మహేందర్‌లు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. నిలిచిపోయిన ట్రాఫిక్‌ను నియంత్రించి మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గణేష్‌కు భార్య శివలీల, ఇద్దరు పి ల్లలు ఉన్నారు. రామకోటికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నదమ్ములున్నారు.