చికెన్ పరిశ్రమ వ్యర్థాలతో ప్రజలకు ముప్పు
ABN , Publish Date - Jan 01 , 2025 | 10:53 PM
అడ్డాకుల స్నేహ చికెన్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ్యాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని వెంటనే తగు చర్యలు చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ డిమాండ్ చేశారు.
- బీసీ పొలిటికల్ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్
మూసాపేట, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : అడ్డాకుల స్నేహ చికెన్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ్యాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని వెంటనే తగు చర్యలు చేపట్టాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపంలో స్నేహ చికెన్ పరిశ్రమ ద్వారా వెలువడే వ్యర్థాలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ్యాలు ఇష్టారాజ్యంగా కాల్వల్లో వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బలీదుపల్లి, పెద్ద మునగాల్‌చేడ్ వాగులో కలిసి కలుషితమై సరళాసాగర్ మీదుగా రామన్‌పాడ్ డ్యామ్‌లోకి వెళ్తున్నాయన్నారు. రామన్‌పాడ్ డ్యామ్ నుంచి సరాఫరా అయ్యే నీరు తాగి ప్రజలు క్యాన్సర్‌తో పాటు ఇతర వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. పెద్ద మునగాల్‌చేడ్ శివారులో ఉన్న జహాంగీర్ దర్గా దగ్గర నెమళ్లు, జింకలతో పాటు గొర్రెలు, పశువులు నీటిని తాగి మృత్యువాత పడుతున్నాయన్నార. ప్రభుత్వ నిబంధనలను తూట్లు పొడుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ పరిశ్రమపై కాలుష్య నివారణ శాఖ అధికారులు పరిశీలించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ వనపర్తి జిల్లా అఽధ్యక్షుడు వన్నం తిరుపతయ్య యాదవ్, నాయకులు వెంకటన్నగౌడ్, అంజన్నయాదవ్, దేవర శ్రీను, రమేష్‌సాగర్, మల్లేష్‌యాదవ్, మ్యాదిరి రాజు, మహమూద్ పాల్గొన్నారు.