Share News

ట్యాంక్‌బండ్‌ వద్ద సందర్శకుల తాకిడి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:08 PM

నూతన సంవత్సరాన్ని పురస్క రించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద సందర్శకుల రద్దీ కనిపించింది.

ట్యాంక్‌బండ్‌ వద్ద సందర్శకుల తాకిడి
జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద ఆటలాడుతున్న చిన్నారులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరాన్ని పురస్క రించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద సందర్శకుల రద్దీ కనిపించింది. నాగర్‌కర్నూల్‌ పట్టణ ప్రజ లకు ఏకైక ఆహ్లాద కేంద్రం కావడంతో చిన్నారు లతో కలిసి ట్యాంక్‌బండ్‌ చేరుకుని సరదాగా గడిపారు. కేసరిసముద్రం బుద్ద ఘాట్‌ వద్ద ఏ ర్పాటు చేసిన బోటులో పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా షికారు చేసి ప్రకృతిని ఆస్వాదించా రు. రోజవారి కంటే రద్దీ ఎక్కువగా కనిపించింది. బతుకుమ్మ ఘాట్‌ వద్ద పార్కులో చిన్నారులు ఆటలాడుతూ సంతోషంగా గడిపారు. నూతన సంవత్సరం సందర్భంగా సందర్శకుల రాకను దృష్టిలో ఉంచుకుని ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రత్యేక తినుబండారాలు, ఐస్‌క్రూం స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని పలు దేవాలయాల వద్ద భక్తుల దర్శనాలతో రద్దీ కనిపించింది.

Updated Date - Jan 01 , 2025 | 11:08 PM