ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:16 PM
అధికార దాహంతో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : అధికార దాహంతో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా కింద రైతులకు ఇచ్చిన హామీ మే రకు ఎకరాకు రూ. 15వేలు ఇస్తామని చెప్పి రూ.12వేలకు కుదించడం దారుణమన్నారు. అనంతరం తహసీల్దార్ సతీష్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్‌గౌడ్, మహిపాల్ రెడ్డి, చిన్న హన్మంతు, కౌన్సిలర్లు విష్ణువర్దన్‌రెడ్డి, మొగిలప్ప, అన్వర్‌హుసేన్, జగ్గలి రాములు, నాయకులు జుట్ల శంకర్, ప్రతాప్‌రెడ్డి, నర్సిం హారెడ్డి, సోంభూపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.