Share News

ప్రారంభమైన డప్పు కళాకారుల రథయాత్ర

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:12 PM

లక్ష డప్పులు, వేయి గొంతుల మహాకళా ప్రదర్శన వరకు ప్రతీ మాదిగ బిడ్డ ఒక డప్పు కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డా.డప్పు స్వామి పిలుపునిచ్చారు.

ప్రారంభమైన డప్పు కళాకారుల రథయాత్ర
అంబేడ్కర్‌ చౌరస్తాలో డప్పు కళాకారుల ప్రచారం

పాలమూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : లక్ష డప్పులు, వేయి గొంతుల మహాకళా ప్రదర్శన వరకు ప్రతీ మాదిగ బిడ్డ ఒక డప్పు కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ డా.డప్పు స్వామి పిలుపునిచ్చారు. ప్రతీ మాదిగ ఇంట్లో డప్పు ఉండాలనే నినాదంతో చేపట్టిన డప్పు కళాకారుల ప్రచార రథయాత్ర మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఈఎఫ్‌, ఎంఎస్‌ఎఫ్‌, ఎంఎస్‌పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించారు. పట్టణంలో డప్పులతో కళా ప్రదర్శనతో బాబు జగ్జీవన్‌రాం, డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ల విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో జరిగే వేల గొంతులు - లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీలను వర్గీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో జంగయ్య, కావలి కృష్ణయ్య, మైలారం శ్రీరాములు, రామచంద్రయ్య, బొక్కి రాములు, రొట్టె శేఖర్‌, వడ్యాల డప్పు కృష్ణ, శివకుమార్‌, వన్నాడ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:12 PM