Share News

నేడు కందనూలుకు డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Jan 11 , 2025 | 10:49 PM

నాగర్‌ కర్నూల్‌ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఆదివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తెలిపారు.

నేడు కందనూలుకు డిప్యూటీ సీఎం
శాయిన్‌పల్లిలో మార్కండేయ పంప్‌ హౌస్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి

బిజినేపల్లి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌ కర్నూల్‌ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఆదివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండ లంలో పొతిరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం పది గంట లకు 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి బిజినేపల్లిలోని శాయిన్‌పల్లి గ్రామ సమీపంలోని మార్కండేయ లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు మోటర్లను 11 గంటలకు అన్‌ చేసి నీటి విడుదలను ప్రారంభిస్తారు. అలాగే పాలెం గ్రామం లోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రాన్ని 12 గం టలకు భూమిపూజ చేస్తారు. ఇక్కడి నుంచి తాడూరు మండలంలోని ఇంద్రకల్‌ గ్రామంలో 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రానికి ఒంటి గంటకు శంకుస్థాపన చేసి నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్‌ హాల్‌లో పబ్లిక్‌ మీటింగ్‌కు హాజరుకానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు నాగర్‌కర్నూల్‌ మండ లంలోని శ్రీపురం, గన్యాగుల గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి తిరిగి హైదారాబాద్‌ వెళ్ళనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 10:49 PM