Share News

అలంపూర్‌ ఆలయాలకు భక్తుల తాకిడి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:33 PM

నూత న సంవత్సరాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల నుం చేకాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రావడం తో బుధవారం ఆలయాలు రద్దీగా మారాయి.

అలంపూర్‌ ఆలయాలకు భక్తుల తాకిడి
జోగుళాంబ అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ

అలంపూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూత న సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త ఆలోచ నలతో 2025 ఏడాది మొత్తం సకల శుభాలు కల గాలని ఆకాంక్షిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల నుం చేకాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రావడం తో బుధవారం ఆలయాలు రద్దీగా మారాయి. ముందుగా స్వామి వారి ఆలయంలో గణపతి పూజ, స్పర్శ దర్శనం, అభిషేకం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన వంటి విశేష పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి చీర, గాజులు, త్రిశతి ఖడ్గమాల, ఒడిబియ్యం సమ ర్పించి మొక్కులు చెల్లించారు.

బాలాజీ ప్రవీణ్‌సింగ్‌, శ్వేతాతేజ్‌ విరాళం

జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వారి దేవస్థానంలో గల అన్నదాన సత్రానికి బుధవారం హైదరాబాద్‌కు చెందిన బాలాజీ ప్రవీణ్‌సింగ్‌, శ్వేతాతేజ్‌ దంపతులు విరాళంగా రూ.లక్ష చెక్కును ఈవో పురేందర్‌ కుమార్‌కు అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలంపూరు పుణ్యక్షేత్రాన్ని దర్శిం చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయాలు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని చెప్పారు.

Updated Date - Jan 01 , 2025 | 11:34 PM