రైతుల స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దు
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:33 PM
రైతు సేవా సహకార సంఘం ఆధీనంలో ఉన్న భూమిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన నిర్మాణాలు చేపటొద్దని సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లు వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు.
హన్వాడ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : రైతు సేవా సహకార సంఘం ఆధీనంలో ఉన్న భూమిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన నిర్మాణాలు చేపటొద్దని సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లు వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం హన్వాడ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో ఎకర పది గుంటల భూమిలో ఓపెన్ జిమ్, రైతు బజార్, మటన్ మార్కెట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చామని, అది కూడా మా ఆధీనంలో ఉండే విధంగా అనుమతి ఇచ్చామని తెలి పారు. అయితే గ్రంథాలయం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎలాంటి అనుమ తులు లేవన్నారు. 1983లో సొసైటీ రైతులంతా కలసి మూడెకరాల భూమి కొన్నామని, ఈ భూమి సొసైటీ రైతులదన్నారు. పాలక వర్గం తీర్మాణం లేకుండా పనులు చేపట్టరాదన్నారు.