Share News

ఆడంబరాలు చేయొద్దు.. భవిష్యత్‌ కార్యాచరణ ఎంచుకోవాలి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:07 PM

డిసెంబరు 31 రోజున ఆడంబరాలు చేసు కోకుండా.. భవిష్యత్‌ కార్యచరణ ఎంచుకోవాలని దావతె ఇస్లామి రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్‌ సూ చించారు.

ఆడంబరాలు చేయొద్దు..   భవిష్యత్‌ కార్యాచరణ ఎంచుకోవాలి
మాట్లాడుతున్న రాష్ట్ర అఽధ్యక్షుడు అల్తాఫ్‌

- దావతె ఇస్లామి రాష్ట్ర అఽధ్యక్షుడు అల్తాఫ్‌

కొత్తకోట, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : డిసెంబరు 31 రోజున ఆడంబరాలు చేసు కోకుండా.. భవిష్యత్‌ కార్యచరణ ఎంచుకోవాలని దావతె ఇస్లామి రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్‌ సూ చించారు. మంగళవారం రాత్రి పట్టణంలోని ఖా ద్రియ మసీదులో పట్టణ దావతె ఇస్లామి శాఖ ఆధ్వర్యంలో డిసెంబరు 31పై సెమినార్‌ నిర్వ హించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలు మూలల నుంచి ఎనిమిది వందల మంది పా ల్గొన్నారు. ఈ సందర్భంగా అల్తాఫ్‌ మాట్లా డుతూ.. డిసెంబరు 31 అంటే తాగడం, తినడం కాదని గతించిన ఏడాదిలో చేసిన మంచిచెడు పనులపై సమీక్షించుకోవాలన్నారు. సాధించిన పనుల్లో కష్టసుఖాలు, జరిగిన లాభనష్టాలు మననం చేసుకోని భవిష్యత్‌లో సాఽధించాల్సిన పనులకు సిద్ధం కావడం వంటి ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టి కులమతాలకు అతీతంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు అందిం చడానికి సన్నద్ధం కావాలని సూచించారు. సెమి నార్‌లో కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ నూర్‌, సర్వర్‌, దావూద్‌, సలాం, అప్రోజ్‌, లతీఫ్‌, రహీం, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:07 PM