గిరి ప్రదర్శన విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:32 PM
అయోధ్యలో రామ మంది రంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం పూర్తి కావడంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం కురుమూర్తి స్వామి ఆలయంలో గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి తెలిపారు.
మబూబ్‌నగర్ న్యూటౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : అయోధ్యలో రామ మంది రంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం పూర్తి కావడంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం కురుమూర్తి స్వామి ఆలయంలో గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధార్మిక సంస్థలు, మహిళా మండలి సభ్యులు, భజన మండలి సభ్యులు శనివారం ఉదయం 10 గంటలకు కురుమూర్తికి చేరు కోవాలన్నారు. అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో అభిషేకాలు, హనుమాన్‌చాలీసా పారాయణం చేయాలన్నారు. విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి నరేందర్, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారా యణ, జనార్దన్, హన్మంతు పాల్గొన్నారు.