Share News

ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:21 PM

నాగర్‌కర్నూల్‌, జోగుళాంబగద్వాల, వనపర్తి జి ల్లాల్లో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా చేసుకున్నారు.

ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు
వనపర్తి పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో హారతి తీసుకుంటున్న భక్తులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌, జోగుళాంబగద్వాల, వనపర్తి జి ల్లాల్లో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా చేసుకున్నారు. అర్ధరాత్రి కేక్‌కట్‌ చేసి సంబు రాలు చేసుకున్నారు. ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నా రు. బుధవారం తెల్లవారు జామునే మహిళలు ఇంటిముందు కల్లాపి చల్లి న్యూ ఇయర్‌ ముగ్గులు వేశారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ దేవాలయాలు, పర్యటక ప్రాంతాల వద్ద సందర్శకుల సందడి కనిపిం చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో సీతారామస్వామి, వేంకటేశ్వర స్వామి, అయ్యప్పస్వామి ఆలయంతో వట్టెం, పాలెం వేంకటేశ్వర స్వామి, అచ్చంపేట ఉమామహేశ్వరం ఆలయం, సోమశిల లలితా సోమేశ్వర ఆలయం, జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూరు బాల బ్రహ్మేశ్వరస్వామి ఆల యం, వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు వివిధ ఆల యా ల్లో భక్తుల రద్దీ కనిపించింది.

Updated Date - Jan 01 , 2025 | 11:21 PM