Share News

నేడు గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Feb 22 , 2025 | 11:25 PM

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల్లో ఐదు నుంచి తొమ్మిదవ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్హత ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

నేడు గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష
పేట సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో రూల్‌ నెంబర్లు వేస్తున్న అధ్యాపకులు

- జిల్లాలో ఎనిమిది పరీక్షా కేంద్రాలు

- దరఖాస్తు చేసుకున్న 4,130 మంది విద్యార్థులు

నారాయణపేట, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల్లో ఐదు నుంచి తొమ్మిదవ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్హత ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కోసం 4,130 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టికెట్‌తో పాటు, బ్లాక్‌, బ్లూ పెన్నులు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోతో హాజరు కావాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఉదయం తొమ్మిది గంటలలోగా చేరుకోవాలన్నారు. జిల్లాలో మక్తల్‌ బీసీ వెల్ఫేర్‌ బాలుర వసతి గృహంలో 300 మంది విద్యార్థులు, నారాయణపేట సింగారం క్రాసింగ్‌ వద్దనున్న దామరగిద్ద బాలుర గురుకులంలో 400 మంది, మక్తల్‌లో కొనసాగుతున్న ఊట్కూర్‌ బాలికల గురుకులంలో 450 మంది, పేట యాద్గీర్‌రోడ్‌ గురుకులంలో 800 మంది, మరికల్‌ గురుకులంలో 800 మంది, కొండాపూర్‌ ట్రైబల్‌ స్కూల్‌లో 840 మంది, పేట కస్తూర్బాలో 340 మంది, ప్రభుత్వ గ్రౌండ్‌ స్కూల్‌లో 200 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు అధికారులు వివరించారు.

Updated Date - Feb 22 , 2025 | 11:25 PM