Share News

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:05 PM

కొత్త ఏడాదిలో శుభం కలగా లని బుధవారం జిల్లా కేంద్రంలోని పలు దేవాల యాలను ప్రజలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని సాయి ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

- భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

- కేకులు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా వాసులు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : కొత్త ఏడాదిలో శుభం కలగా లని బుధవారం జిల్లా కేంద్రంలోని పలు దేవాల యాలను ప్రజలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి, సా యినగర్‌ కాలనీ రామాలయం, రాజనగరం అ య్యప్ప స్వామి, చింతల హనుమాన్‌ ఆలయా లను భక్తులు సందర్శించి పూజలు చేశారు. పట్ట ణంలోని ఎంబీ ఒలివ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుధవారం సెలవు దినం కావడంతో జిల్లా కేంద్రంలోని ఏకో పార్కుకు పిల్లలు, పెద్దలు పోటెత్తారు.

కొత్తకోట: పట్టణంలోని అంబా భవాని, కోదండ రామస్వామి, రాఘవేంద్రస్వామి, సం కల్ప సిద్ధి సాయినాథ, కన్యకా పరమేశ్వరి, వెంక టగిరి ఆలయాలతో పాటు కానాయపల్లి, పామా పురం, కనిమెట్ట గ్రామాల్లోని కోటిలింగేశ్వర స్వామి, రామేశ్వరస్వామి, హరిహర అయ్యప్ప స్వామి ఆలయాలకు భక్తులు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మదనాపురం: మండలంలో యువకులు కలిసి ఆయా కాలనీలలో కేకులు కట్‌ చేసి సంబ రాలు చేశారు. క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రా ర్థనలు జరిపారు. బుధవారం ఉదయం ప్రముఖ దేవాలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకున్నారు.

ఆత్మకూరు: పట్టణ కేంద్రంలోని షిరిడి సా యి, అయ్యప్ప స్వామి, వేంకటేశ్వర స్వామి ఆల యాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ నిర్వహించారు. మండలంలో క్రైస్తవులు చర్చి లకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అమరచింత: పట్టణంలో వ్యాయామ క్రీడా కారులు, మార్నింగ్‌ వాకర్స్‌ సామూహికంగా కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేశారు. ఎంబీ కార్మెల్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Updated Date - Jan 01 , 2025 | 11:05 PM