హోరాహోరీగా నెట్‌బాల్ టోర్నీ
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:27 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడి యంలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ టోర్న మెంట్ ఉత్కంఠభరింతంగా సాగుతోంది.
- పురుషుల విభాగంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట విజయం
- మహిళా విభాగంలో మహబూబ్‌నగర్, వనపర్తి గెలుపు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడి యంలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ టోర్న మెంట్ ఉత్కంఠభరింతంగా సాగుతోంది. పోటీల్లో క్రీడాకారులు నువ్వా, నేనా అన్నట్లుగా తలబడుతు న్నారు. బుధవారం నిర్వహించిన పోటీల్లో పురుషుల మహబూబ్‌నగర్ జట్టు హన్మకొండపై 21-04, రంగారెడ్డిపై 15-05 పాయింట్ల తేడాతో గెలిచింది. ఖమ్మం జట్టు పెద్దపల్లిపై 35-01, కామారెడ్డి జట్టు మెదక్‌పై 17-14, నిజామాబాద్ జట్టు ఆసిఫాబాద్‌పై 21-10, వరంగల్ జట్టు నిర్మల్‌పై 13-5, రాజన్న సిరి సిల్ల జట్టు మేడ్చల్‌పై 05-04 పాయింట్లతో గెలు పొందాయి. నల్గొండ జట్టు వనపర్తిపై 15-09, కరీం నగర్ జట్టు గద్వాలపై 23-12, ఆదిలాబాద్ జట్టు పెద్దపల్ల్లిపై 13-02, మెడ్చల్ జట్టు మెదక్‌పై 29-09 పాయింట్లతో గెలుపొందాయి. నిజామాబాద్ జట్టు జనగాంపై 18-13, నాగర్‌కర్నూల్ జట్టు నిర్మల్‌పై 32-01, నారాయణపేట జట్టు భద్రాద్రి కొత్తగూడెంపై 12-03, మహబూబాబాద్ జట్టు సంగారెడ్డిపై 28-04 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. మహిళల విభా గంలో మహబూబ్‌నగర్ జట్టు మంచిర్యాలపై 19-03, ఖమ్మం జట్టు నాగర్‌కర్నూల్‌పై 25-01, ఆసిఫాబాద్ జట్టు నిర్మల్‌పై 15-01 పాయింట్ల తేడాతో గెలిచాయి. నల్గొండ జట్టు వరంగల్‌పై 24-02, కరీంనగర్ జట్టు వనపర్తిపై 08-03, జనగాం జట్టు మంచిర్యాలపై 21-03, నిజామాబాద్ జట్టు నారాయణపేటపై 14-03, మెదక్ జట్టు మహబూబాబాద్‌పై 15-08 పాయింట్ల తేడాతో గెలిచాయి. నల్గొండ జట్టు రాజన్న సిరిసిల్లపై 26-01, వనపర్తి జట్టు హన్మకొండపై 07-04, జనగాం జట్టు జగిత్యాలపై 17-03, నిజామాబాద్ జట్టు నాగర్ కర్నూల్‌పై 13-01పై, ఖమ్మం జట్టు నారాయణ పేటపై 30-04 పాయింట్ల తేడాతో గెలుపొందాయి.
జాతీయ స్థాయి పోటీలకు ఎదగాలి
నెట్‌బాల్ జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబే దుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా క్రీడాశాఖ ఆధ్వ ర్యంలో డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలను రెండవ రోజు బుధ వారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, ఒలింపిక్ సంఘం జిల్లా అఽధ్యక్షుడు ఎన్‌పీ వెంక టేశ్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీవై ఎస్‌వో శ్రీనివాస్, నెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విక్రమాదిత్యరెడ్డి, ఖాజాఖాన్, కబడ్డీ సంఘం సెక్రటరీ కురుమూర్తిగౌడ్, యోగా సంఘం సెక్రటరీ బాలరాజ్, డీఎస్‌ఏ కార్యాలయ సిబ్బంది రవీందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
టోర్నీలో గందరగోళం
సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ టోర్నీలో బుధవారం కొంత గందరగోళం నెలకొన్నది. టోర్నీకి ప్రతీ జిల్లా నుంచి ఒక మహిళ, ఒక పురుషుల జట్టు మాత్రమే హాజరుకావాల్సి ఉండగా, రంగారెడ్డి జిల్లా నుంచి రెండు పురుషులు, రెండు మహిళల జట్లు వచ్చాయి. వాటిలో ఒక పురుష, ఒక మహిళా జట్టుకు రంగారెడ్డి జిల్లా డీవైఎస్‌వో సంత కంతో కూడిన ఎంట్రీ ఫాంలు ఉన్నాయి. మరో రెండు జట్లకు ఎంట్రీఫాం లేకపోవడంతో అనుమతించలేదు. దీంతో క్రీడాకారులు ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మా జట్లు గెలుపొంది, రంగారెడ్డి జిల్లా డీవైఎస్‌వో చేతుల మీదుగా పతకాలు, సర్టిఫికెట్ల ను తీసుకున్నట్లు తెలిపారు. అయినా తమకు ఆడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. క్రీడాకారులు గంట సేపు చేపట్టిన ఆందోళనతో మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. ఈ సంద ర్భంగా డీవై ఎస్‌వో శ్రీనివాస్ ఇరు జట్ల కోచ్‌లు, క్రీడాకారులతో మాట్లాడారు. ఆడేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణి గింది. ఈ విషయంపై డీవైఎస్‌వో శ్రీనివాస్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, రంగారెడ్డి జిల్లా నుంచి అదనంగా రెండు జట్లు వచ్చాయని తెలి పారు. రంగారెడ్డి డీవైఎస్‌వో, శాట్ ఉన్నతాధికా రులతో చర్చించి, ఇరు జట్ల క్రీడాకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.