Share News

ఆధునిక సాంకేతిక విద్యకు పెద్దపీట

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:44 PM

ఆధునిక సాంకేతిక విద్యకు తెలంగాణలో పె ద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాఽ ద్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి అన్నారు.

ఆధునిక సాంకేతిక విద్యకు పెద్దపీట
విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తి రూరల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : ఆధునిక సాంకేతిక విద్యకు తెలంగాణలో పె ద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాఽ ద్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వ నపర్తి శ్రీరామన్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆ ధ్వర్యంలో గత నెలలో శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ఐఐటీ టా లెంట్‌ టెస్టు విజేతలకు బహుమతి ప్రదానం చే సే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వ్యవ సాయ పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగా మిగా నిలపడానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని, నేటి విద్యార్థులు ఆధునిక సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవడానికి కష్టపడి చదవాలని పిలు పునిచ్చారు. వనపర్తిని విద్యారంగంలో ముందు వరుసలో నిలపడానికి విద్యాహబ్‌గా మార్చ డానికి తన వంతు ప్రయత్నం చేశానన్నారు. వె ౖద్య సాంకేతిక విద్యను సంబంధించిన స్టడీ సర్కిల్‌ ఇక్కడ ఏర్పాటు చేయడానికి శాయశక్తు ల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇ లాంటి టాలెంట్‌ టెస్టులు నిర్వహించడం అభిన ందనీయమన్నారు. అనంతరం విజేతలకు చిన్నా రెడ్డి నగదు పారితోషికం శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో సాహితీ కళావేది క జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌ గౌడ్‌, డీసీఈ బీ జిల్లా సెక్రటరీ సూర చంద్రశేఖర్‌, మండల విద్యాశాఖాధికారులు మద్దిలేటి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఏసీజీవో గణేష్‌ కుమార్‌, స్పెక్ట్ర ఐఐటి కృష్ణ, ఉ పాధ్యాయ సంఘాల నాయకులు సురభి శ్రీనివా స్‌రావు, మహిపాల్‌ రెడ్డి, హరిప్రసాద్‌, శ్రీనివాస్‌, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:44 PM