Share News

వర్గీకరణను నీరుగారుస్తున్న మందకృష్ణ

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:12 PM

ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ నీరుగారుస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి ఆవేదన వ్యక్తం చేశారు.

వర్గీకరణను నీరుగారుస్తున్న మందకృష్ణ
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ పిడమర్తి రవి

- ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి

పాలమూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ నీరుగారుస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ విద్యార్థి, యువగర్జన సన్నాహక సమావేశంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో జేఏసీ అధ్యక్షుడు సురేశ్‌, గడ్డమీది గోపాలకృష్ణ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ మందకృష్ణ నీరుగారుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయటం మందకృష్ణ మాదిగకు, బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు. వర్గీకరణ చేయడానికి అనేక దశలో ప్రక్రియ మొదలుపెట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై లక్ష డప్పులు, వేయి గొంతుకల కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. వర్గీకరణ చేయని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మందకృష్ణ ఒక్క పత్రికా ప్రకటన చేయలేదన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో చేపట్టిన మాదిగ విద్యార్థి యువ గర్జన సభను విజయవంతం చేయాలన్నారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నండ్రు నరసింహారావు, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్‌, మెట్ల యాదన్న, దేవన్న, సురేష్‌, రమేష్‌, కృష్ణ, అరుణ, రవి, నరసింహులు, మల్లేష్‌, రంగస్వామి, మాడెన్న, వెంకట్రాములు, చెన్నయ్య, యాదగిరి, విజయ్‌, గోపాల్‌, నరేష్‌, కృష్ణకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:12 PM