చింతరేవుల అంజన్నకు ఎంపీ ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:32 PM
ధరూరు మండల పరిధిలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు.
ధరూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ధరూరు మండల పరిధిలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ ధర్మకర్త గిరిరావు ఎంపీ డీకే అరుణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆల యంలో ప్రత్యేక పూజలుచేశారు. నూతన సంవత్సరంను పురస్కరించుకుని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు, ధర్మకర్త తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. రామచంద్రారెడ్డి, రామాంజనేయులు, రామక్రిష్ణ, హనుమంతరాయ, నర్సన్‌దొడ్డి క్రిష్ణారెడ్డి, అర్చకులు కిష్టాచారి పాల్గొన్నారు.