ఒక్క రోజే రూ. 3.30 కోట్ల విలువైన మద్యం తాగేశారు
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:20 PM
ఈ ఏడాది వనపర్తి జిల్లా వ్యాప్తంగా నూతన సంవ త్సర వేడుకల్లో భాగంగా జోష్ కనిపించింది.
వనపర్తి క్రెం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది వనపర్తి జిల్లా వ్యాప్తంగా నూతన సంవ త్సర వేడుకల్లో భాగంగా జోష్ కనిపించింది. జిల్లా లో మద్యం, మాంసం విక్రయాలు జోరుగా సాగా యి. ఈ ఏడాది డిసెంబరు 30, 31వ తేదీల్లో రెం డు రోజుల్లోనే జిల్లాలో రూ.7కోట్ల 79 లక్షల 40 వేల విలువైన మద్యం తాగేశారు. గతేడాదితో పోలి స్తే కొంచెం మేర మద్యం విక్రయాలు అధికంగా జరిగినట్లు సమాచారం.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వనపర్తి జిల్లాలో మద్యం ఏరులై పారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కారీ శాఖకు మద్యం విక్రయాలు జరిపేందుకు 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటలకే మూసివేసే దుకాణాలు మందుబాబుల సౌకర్యార్థం 12 గంటల దాకా తెరిచి ఉంచారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బార్లు, వైన్స్‌ల వద్ద ఉదయం 10 గంట ల నుంచే సందడి కనిపించింది. జిల్లాలో 30వ తేదీ రోజు 4,578 లిక్కర్ కేసులు, 4,101 బీర్ కేసులు, 31వ తేదీ రోజు 3,355 లిక్కర్ కేసులు, 3,546 బీర్ కేసులు విక్రయాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లో నే ఆబ్కారీ శాఖకు వనపర్తి జిల్లా నుంచి రూ.7 కోట్ల 79 లక్షల ఆదాయం సమకూరింది.
పెరిగిన మాంసం విక్రయాలు
డిసెంబరు 31 అంటేనే మందు, మటన్, చికె న్‌తో దావత్ చేసుకోవడం సహజం.ప్రతీ యేటా మద్యంతో పాటు మాంసం విక్రయాలు సహజం. రోజురోజుకు మాంసం ప్రియులు పెరుగుతుండడంతో ఈ ఏడాది మాంసం విక్రయాలు బాగా జరిగాయి. మిగతా రోజులతో పోలిస్తే 31వ తేదీన జిల్లా వ్యాప్తంగా రూ.80 లక్షల విలు వైన మాంసం విక్రయించినట్లు సమాచారం.