Share News

గోవింద నామస్మరణతో మార్మోగిన పాలమూరు

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:02 PM

పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలో బుధవారం మన్యం కొండ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్రను నిర్వహించారు.

 గోవింద నామస్మరణతో మార్మోగిన పాలమూరు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మన్యకొండకు పాదయాత్రగా బయలు దేరిన భక్తులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలో బుధవారం మన్యం కొండ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెట్టిన గోవిందలతో పాలమూరు వీధులు మార్మోగాయి. పాదయాత్రను వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ధి యాదిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు గుండా మనోహర్‌ ప్రారంభించి, మాట్లాడారు. ధనుర్మాసంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల దోశాలు తొలగిపోతాయన్నారు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసి ఆకర్షనీయమైన బహుమతులు అందిస్తా మన్నారు. ప్రజలలో భక్తిభావం పెంపొందించేం దుకు ఆర్యవైశ్య సంఘం తనవంతు కృషి చేస్తోందన్నారు. ఈ పాదయాత్ర గ్రంథాలయం, వన్‌టౌన్‌ చౌరస్తా, మేనక టాకీస్‌ చౌరస్తా, గిర్నిగడ్డ, బండమీదిపల్లి మీదుగా మన్యంకొండకు చేరుకుంది. పాదయాత్రలో భక్తులు గోవిందలతో పాటు, భక్తి కీర్తనలు, భజనలు చేస్తూ ముందు కు సాగారు. వారికి సహయంగా వాహనాల్లో సహయక బృందాలు బయలుదేరాయి. స్వర లహరి కల్చరల్‌ అకాడమీ అఽధ్యక్షుడు బాగన్న గౌడ్‌, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల వేణుగోపాల్‌, నాగరాజు, అయ్యప్ప గురు స్వాములు శంకర్‌, ప్రవీణ్‌కుమార్‌, సాయి, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:02 PM