ఇష్టంతో చదవాలి
ABN , Publish Date - Jan 10 , 2025 | 11:30 PM
విద్యా ర్థులు ఇష్టంతో చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుతారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- సైన్స్ అండ్ టెక్నాలజీపై సదస్సు
నర్వ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులు ఇష్టంతో చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుతారని మక్తల్ ఎమ్మెల్యే వా కిటి శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అబ్దుల్‌కలామ్ స్పూర్తితో సైన్స్ అండ్ టెక్నా లజీపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, విద్యార్థులు ఏర్పాటుచేసిన సైన్స్ పరికరాలను పరిశీలిం చారు. అంతకుముందు ప్రత్యేకంగా ఏర్పాటు చే సిన బస్సులో సాంకేతిక విద్యపై ఎలకా్ట్రనిక్ క మ్యూనికేషన్ ఇంజనీర్ మధులాస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎంఈవో రామకృష్ణ, తహసీల్దార్ మల్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.