Share News

రికార్డు స్థాయిలో రక్త సేకరణ

ABN , Publish Date - Jan 08 , 2025 | 11:47 PM

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినాన్ని పురస్కరిం చుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వనపర్తి జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా 559 యూనిట్ల రక్తం సేకరించినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

రికార్డు స్థాయిలో రక్త సేకరణ
రక్తదానం చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

- ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం

-- 559 యూనిట్లతో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రక్త సేకరణ

వనపర్తి అర్బన్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినాన్ని పురస్కరిం చుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వనపర్తి జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా 559 యూనిట్ల రక్తం సేకరించినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్‌ ఆధ్వ ర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశా రు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక రోజు ఏర్పా టు చేసిన రక్తదాన శిబిరంలో 559 యూనిట్ల రక్తం సేకరించడం ఇదే మొదటిసారి అని వైద్యాధికారులు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసినందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 08 , 2025 | 11:47 PM