ఆలయాలు కిటకిట
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:07 PM
నూతన సంవత్సరాన్ని పురస్క రించుకొని ఉమామహేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వెకువజామునుంచే భక్తులు పె ద్ద ఎత్తున తరలివచ్చి ఉమామహేశ్వరుడ్ని ద ర్శించుకున్నారు.
- భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
- ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
అచ్చంపేట/చారకొండ/కల్వకుర్తి/ఉప్పునుంతల/బిజినేపల్లి/ఊర్కొండ/తాడూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరాన్ని పురస్క రించుకొని ఉమామహేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వెకువజామునుంచే భక్తులు పె ద్ద ఎత్తున తరలివచ్చి ఉమామహేశ్వరుడ్ని ద ర్శించుకున్నారు. ఏడాది పొడవునా తమకు అన్ని శుభాలే జరగాలని కాంక్షిస్తూ పూజలు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆల యాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల తా కిడిని దృష్టిలో పెట్టుకొని పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కొం డదిగువన నుంచి కొండపైకి నడిపింది. ఉమా మహేశ్వరంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆల య కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాస్ రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సిర్సనగండ్లలో..
చారకొండ మండలంలో రెండవ అపర భ ద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్లలోని అయో ధ్యనగర్ (గుట్ట)లో వెలసిన సీతా రామచంద్రస్వామి ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకొ ని పూజలు చేశారు. ఆలయ అర్చ కులు స్వామివారికి అర్చనలు అభి షేకాలు చేశారు.
కల్వకుర్తిలో...
కల్వకుర్తి పట్టణంలోని పలు దే వాలయాలను స్థానికులు దర్శించు కుని పూజలు నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని నియోజకవర్గంలోని పలువురు నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఉప్పునుంతల మండల పరిధిలోని మామిళ్లప ల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామిని బుధవా రం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దర్శించు కున్నారు. ఈ సందర్భంగా స్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేసి, తీర్ధ ప్రసాదం తీసుకున్నా రు. ప్రజలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. నాయకులు అనంతరెడ్డి, నర్సింహరెడ్డి, గోవర్ధ న్‌రెడ్డి, మొగులాల్, నర్సింహరావు, తిరుపతయ్య, రాత్లావత్ కృష్ణ, తదితరులు ఉన్నారు.
వట్టెం వెంకన్న ఆలయంలో
బిజినేపల్లి మండల కేంద్రంతో పాటు పా లెం, వట్టెం, నంది వడ్డెమాన్‌లోని ఆలయాలో తె లవారు జాము నుంచే చుట్టు పక్కల గ్రామాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయాలు నిండిపోయాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు దైవ దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తే అంత మంచే జరుగుతుందన్న విశ్వాసంతో భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టేందు కు ఆలయాల బాట పట్టారు. ఆలయాలకు తర లి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గ కుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వట్టెం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సందడి ప్రతాప్ రెడ్డి, పాలెం వెంకన్న ఆలయం ఈవో రంగారావులు తెలిపారు.
అభయుడి ఆలయంలో భక్తుల సందడి
ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయంలో బుధవారం భక్తుల సందడి నెలకొంది. బుధవారం నూతన సంవత్సరం పురస్కరించుకొని పరిసర గ్రామాల తో పాటు సదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయం పరిసరాలు కిక్కిరెసినవి. తెల్లవారుజామున అర్చ కులు స్వామివారికి అభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం కల్పించారు. భ క్తులు తమ మొక్కులను చెల్లించుకొని సాము హిక వ్రతాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది మారుతిరావు, వరలక్ష్మి, శ్రీశైలం. రవికుమార్, అ ర్చకులు దత్త్తాత్రేయశర్మ, మహేష్‌శర్మ, ప్రవీణ్ శర్మ, శ్రీనివాసశర్మ భక్తులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో నరసింహస్వామి సరస్వతీల హోమం
తాడూరు మండలంలోని సిర్సవాడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహ సర స్వతి దేవి జయంతిని పురస్కరించుకుని హో మాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారి ని ఊయలలో వేసి ఊపి మొక్కులు చెల్లించుకు న్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాదాలను అందజేశా రు. ఆలయ అర్చకులు జగదీశ్వర్, రమేష్, రాఘవేందర్, వెంకటయ్య, రాములు, రవి కుమార్, పరుశరాములు, గోపాల్‌గౌడ్, తి రుపతయ్య, మల్లేష్ పాల్గొన్నారు.
ఎంబీ చర్చిలో...
కందనూలు(ఆంధ్రజ్యోతి) : నాగర్‌క ర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్య ప్రసంగికులుగా క ర్నూల్ ప్రాంతం నుంచి డాక్టర్ రెవరెండ్ మో జస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఆ దేవాది దేవుని వ్యాక్యా న్ని అనుసరించినప్పుడే అందరం నూతన జీవితాన్ని పొంది ఆశీర్వదింపబడుతామని అ న్నారు. అనంతరం చర్చి కమిటీ చైర్మన్ ఆధ్వ ర్యంలో కేక్ కట్ చేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక సంఘ పాస్టర్ వీఎస్.భాస్కర్, చర్చి కమిటీ సభ్యులు, చైర్మన్, యూత్ కమిటీవారు, మహిళలు, సంఘ పెద్దలు, సంఘస్తులు, సుమారు 300మంది హాజరయ్యారు.