Share News

ఘనంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:14 PM

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి సంవత్సరం పూర్తైన సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.

ఘనంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ
వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో బాలరాముడి విగ్రహ పత్రిష్ఠ

- పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి సంవత్సరం పూర్తైన సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ప్టణంలోని కొత్తగంజి నీలకంటేశ్వర స్వామి ఆలయంలో, సీతారామంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థలు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాతగంజిలో హైందవ శక్తి సేవాసంస్థ ఆధ్వర్యంలో వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. ఆయోధ్యలో ఏర్పాటు చేసినట్లుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. చిన్నారులు సీతారాముల వేషధారణతో చేసిన నృత్యప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. సీమ నరేందర్‌, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

బాలానగర్‌ : మండలంలోని గౌతాపూర్‌ గుట్టపై వెలసిన శ్రీవిజయలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో శనివారం నరసింహస్వామి కల్యాణం ఆలయ ధర్మకరత బాలానందదాసు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు.

Updated Date - Jan 11 , 2025 | 11:14 PM