Share News

నిండా నిర్లక్ష్యం

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:32 PM

అధికారు ల పర్యవేక్షణ లోపం.. గుత్తేదారుల నాసిరకం పను లతో రైతుల పాలిట శాపంగా మారుతూ వస్తున్నది. మక్తల్‌ నియోజకవర్గంలోని అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన చంద్రఘడ్‌ లిఫ్టు నిర్వహణ అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది.

నిండా నిర్లక్ష్యం
చంద్రఘడ్‌ లిఫ్టు

- పట్టింపులేని ఎత్తిపోతలు?

- చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం

- ప్రశ్నార్ధకంగా 15వేల ఎకరాల ఆయకట్టు

అమరచింత, జనవరి 10(ఆంధ్రజ్యోతి): అధికారు ల పర్యవేక్షణ లోపం.. గుత్తేదారుల నాసిరకం పను లతో రైతుల పాలిట శాపంగా మారుతూ వస్తున్నది. మక్తల్‌ నియోజకవర్గంలోని అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన చంద్రఘడ్‌ లిఫ్టు నిర్వహణ అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది. అమరచింత మండలం కృష్ణంపల్లి ఈర్లదిన్నె, ప్రియదర్శిని నందిమల్ల ఎక్స్‌రోడ్డు, గ్రామాల శివారులో జూరాల ప్రాజెక్టు బ్యా క్‌ వాటర్‌కు అనుసంధానంగా చంద్రఘడ్‌, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. గత రెండేళ్లుగా తరచూ మూడు లిఫ్టుల పైపులైన్‌లు పగులు తూ ప్యానల్‌ బోర్డులు, మోటార్లు పనిచేయక లిఫ్ట్‌ మూతపడింది. మూడు లిఫ్ట్‌లు నడవక 15వేల ఎ కరాలు ప్రశ్నార్థకంగా మారి వ ర్షంపై ఆధారపడే పరిస్థితి ఏర్ప డింది.

15వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా..

జూరాల ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ నిల్వ నీటి ఆధారంగా 2005 సంవత్సరంలో అ ప్పటి ప్రజాప్రతినిధులు రూ.50 కోట్లతో చం ద్రఘడ్‌, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి, ఒక్కొక్క లిఫ్టు కింద 5వేల ఎకరాలు మొత్తం 3 లిఫ్ట్‌లు కలిపి 15వేల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రారంభించారు. ఆది నుంచి చంద్ర ఘడ్‌ లిఫ్ట్‌కు కాం ట్రాక్టర్‌ నాసిరకం పనుల కారణంగా రైతుల పాలిట శాపంగా మారుతూ వస్తున్నది. ఈ మూడు పథకా లు మూతపడటంతో ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.

రూ.7.50 కోట్లతో ప్రతిపాదనలు

నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథక మైన చంద్రఘడ్‌ లిఫ్టును గుత్తేదారుడు నాణ్యత లో పం అస్తవ్యస్తంగా నిర్మించి లిఫ్ట్‌ నిర్వహణ బాధ్యతను రైతులకు అప్పగించారు. ప్యాన ల్‌ బోర్డు తరచూ కాలుతున్న మోటార్లు పగులుతున్న పైపులతో నిర్వహణ చేయ లేక అటు ప్రభుత్వం నుంచి నిధులు రాక ఆదిలోనే ఈ ఎత్తిపోతల పథకాలు మూత పడ్డాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన త రువాత రైతులు, స్థానిక ప్రజాప్రతినిధు లు విన్నపం మేరకు చంద్రఘడ్‌ లిఫ్టుకు పూర్వ వైభవం తీసు కురావడానికి నడుం బిగించారు. చంద్రఘడ్‌, బెక్కర్‌పల్లి, నాగిరె డ్డిపల్లి లిఫ్టుల ఆధునీకరణకు 7 కోట్ల 50 లక్షల ప్రతిపాదనలను సిద్ధం చేసి అధికా రులు ఇరిగేషన్‌ శాఖ మంత్రికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అందజేశారు.

ప్రతిపాదనలు పంపించాం

చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం మరమ్మతులు పూర్వ వైభవం కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపించాం. రూ.ఏడు కోట్ల పైచిలుకు నిధుల ప్రతిపాదనలు కాబట్టి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. మరమ్మతుల అనంతరం రైతులు సమన్వయంతో మూడు లిఫ్ట్‌లను విజయవంతంగా నడుపుకుంటారు.

- ఆంజనేయులు, చిన్న నీటి పారుదల శాఖ సహాయ ఇంజనీరు

Updated Date - Jan 10 , 2025 | 11:32 PM