Share News

సంప్రదాయ సౌందర్యం

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:29 PM

తరత రాలుగా వస్తున్న సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణా లు, అలంకరణ పద్ధతులను శ్రద్ధగా కాపాడుకుంటు న్నారు గిరిజనులు.

సంప్రదాయ సౌందర్యం
తీజ్‌ ఉత్సవం సందర్భంగా సంప్రదాయ అలకరణలో గిరిజన యువతులు (ఫైల్‌)

- లంబాడీ మహిళల వస్త్రాలంకరణ ప్రత్యేకం

- దుస్తులపై పూసలు, అద్దాలతో ప్రత్యేక డిజైన్లు

- జడకు చుంచులు, చెవులకు లోలాకులు

- తలపై ముసుగు, అద్దాలతో కుట్టిన దుస్తులు

- ఉత్సవాలు, పండుగల సందర్భంగా ధరించేందుకు గిరిజన యువతుల ఆసక్తి

అచ్చంపేట, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : తరత రాలుగా వస్తున్న సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణా లు, అలంకరణ పద్ధతులను శ్రద్ధగా కాపాడుకుంటు న్నారు గిరిజనులు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని లంబాడీ మహిళల వస్త్రధారణ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. వారు ధరించే దుస్తులు, ఆభరణాలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం కాలం మా రింది, జీవనశైలీ మారింది. అందుకు అనుగుణంగా గిరిజన మహిళల వస్త్రధారణ కూడా మారింది. ఉన్న త విద్యాభ్యాసం, ఉద్యోగాలు చేస్తున్న యువతులు మారిన కాలానికి అనుగుణంగా ఆధునిక వస్త్రాలను ధరిస్తున్నారు. అయితే పండుగలు, ఉత్సవాల సంద ర్భంగా సంప్రదాయ దుస్తులు, ఆభరణాలను ధరిం చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ప్రత్యేక నృత్యా న్ని నేర్చుకుంటున్నారు. యువకులు కూడా తలపాగా, కుర్తా, పంచెలు ధరిస్తున్నారు.

183 గిరిజన గ్రామ పంచాయతీలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 183 గిరిజన గ్రామ పంచాయతీలు, 892 ఆవాసాలు ఉన్నాయి. మొత్తంగా గిరిజనుల జనాభా 1,81,173 మంది ఉండగా, వారిలో 1,37,797 మంది మహిళలు ఉన్నారు. వారిలో పెద్ద వయసు వారు ఇప్పటికీ సంప్రదాయ దుస్తులనే ధరి స్తున్నారు. అయితే ఆ దుస్తులను ధరించడం, ప్రత్యేక ఆభరణాలతో అలంకరించుకోవడానికే చాలా సమయం పడుతుంది. దీంతో చాలా మంది విద్యాభ్యాసం, ఉద్యోగాలు చేస్తున్న యువతులు అంత సమ యం కేటాయించలేకపోతున్నారు. అంతే కాకుండా ఉరుకులు, పరుగుల జీవితాల్లో ఆ దుస్తులను ధరిం చడం సౌకర్యంగా ఉండకపోవడం కూడా వారు ఒక కారణంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ సంస్కృ తి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు లంబాడీ మహిళలు కృషి చేస్తున్నారు. తండాలు, సమీప పట్ట ణాల్లో నిర్వహించే తీజ్‌ ఉత్సవాలు, సేవాలాల్‌ జయం తి, ముత్యాలమ్మ పండుగ తదితర గిరిజన ఉత్సవాల్లో యువతులు తమ సంప్రదాయ దుస్తులు ధరించేలా, ఆభరణాలతో అలంకరించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

అలంకరణకే రెండు గంటలు

సంప్రదాయ వస్త్రధారణ, కేశాలంకరణకు దాదాపు రెండు గంటలకు పైగానే పడుతుందని లంబాడీ మహిళలు చెప్తున్నారు. ముందుగా తల వెంట్రుకలను దువ్వి జడ వేస్తారు. ఆ తర్వాత ముందు వైపు ము ఖానికి రెండు వైపులా చిన్న జడలను అల్లి ‘చుంచుల’తో అలంకరిస్తారు. వాటిని చోట్లు అంటారు. అలాగే జడను ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలతో అలంకరిస్తున్నారు. ఆ తర్వాత చేతుల నిండా గాజు లు, కడియాలు, పట్టీలను ధరిస్తారు. అద్దాలు, పూసలు, గవ్వలతో అందంగా కుట్టిన మేలి ముసుగు, లుంగ, రవికను ధరిస్తారు. ఇలా ఎవరికి వారు అలంకరించుకోవడం సాధ్యం కాదని, మరో మహిళ సహ కారం తప్పనిసరి అని వారు చెప్తున్నారు.

జత దుస్తులు, ఆభరణాలకు రూ. 40 వేలు

గిరిజన సంప్రదాయ దుస్తుల తయారీకి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది. జత దుస్తులు, ఆభరణాలకు దాదాపు రూ.40 వేలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దుస్తుల తయారీకి అవసరమైన పూసలు, అద్దాలు, పాత నాణేలను జాతరలు, సంతల్లో కొనుగోలు చేస్తా రు. ప్రధానంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట సంతలో గిరిజన వ్యాపారులు వీటిని విక్రయిస్తుంటారు. అలాగే ప్రతీ సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత, రంగాపూర్‌ గ్రామంలో నిర్వహించే హజ్రత్‌ నిరంజన్‌ షేక్‌ షా వలీ జాతర సందర్భంగా వీటి క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి.

Updated Date - Jan 01 , 2025 | 11:29 PM